0-2_Communication

Carengrow

మీ శిశువు ఎదుగుదల, అభ్యాసం కోసం తొమ్మిది నెలలుగా ఎదురుచూస్తున్న నవజాత శిశువు ఇంటికి వచ్చేసింది. ఇల్లంతా సంబరమే... పెద్దలు, పిల్లలు అన్న తేడా లేకుండా బిడ్డను చూసేందుకు పోటీ పడతారు. బిడ్డ నిద్ర లేచి ఉన్న సమయంలో మమ్మల్ని చూసి నవ్విందంటే, మమ్మల్ని చూసి నవ్వందంటూ మురిసిపోతారు. ఇంట్లో అతి పెద్ద విఐపి మీ బిడ్డే. నిద్రపోతున్నప్పుడు చప్పుడు చేయకూడదు, లేచి ఉన్నప్పుడు ఎలా పడితే అలా ఎత్తకూడదు... బిడ్డ ఏం చేసినా అబ్బురమే! నవ్విందంటే నవ్విందని, కాళ్ళు ఆడిస్తే... చాలా విద్యలు వచ్చేసాయని సంబరపడతారు. కానీ, పసి బిడ్డ అయినందున తల్లులకు ఎప్పుడూ టెన్షనే ఉంటుంది. ముఖ్యంగా తొలిసారి తల్లులు అయినవారికైతే మరీను...వారు ఏడ్చినా, ఏడవకపోయినా, నవ్వినా, నవ్వకపోయినా, కాళ్ళాడించినా, ఆడించకపోయినా ప్రతీది భయమే. సరిగ్గా అటువంటి తల్లులకు గైడెన్స్ ఇవ్వడం కోసం ఉద్దేశించిందే ఈ వీడియో.... మీ నవజాత శిశువు ఇప్పటికే కమ్యూనికేటర్ (అంటే సంభాషిస్తున్నాడు). మీరు కనిపించకపోతే, మీరు అవసరం అయితే కలతపడి, ఏడుస్తాడు, శాంతంగా ఉన్నప్పుడు గలగలమని శబ్దాలు చేస్తూ ఆడుకుంటాడు. గింజుకోవడం, అటూ ఇటూ తిరుగుతూ ఆడటం కూడా బిడ్డ సంభాషణ

Sito del podcast

Ascoltalo nella tua app

Episodi

Ancora nessun episodio.